మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
14-06-2024 01:04 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై శుక్రవారం కేసు నమోదైంది. పేట్బషీరాబాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు రాజశేఖర్రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పేట్బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చి వేశారని శేరి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
.






