21 August, 2026 | 11:29 AM

కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ లో కీలక పరిణామం

14-06-2024 01:21 PM

హైదరాబాద్: కాళేశ్వరంపై న్యాయవిచారణ కమిషన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు సీనియర్ ఇంజినీర్లను దూరంగా పెట్టాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. కమిషన్ విచారణ ప్రారంభించే ముందుగానే ఇంజినీర్ల సమావేశం నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ పెట్టుకుని కొందరు ఇంజినీర్లు కూడబలుక్కున్నట్లు సమాచారం.

ఇంజినీర్ల తీరును జస్టిస్ పీసీ ఘోష్ తీవ్రంగా పరిగణించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఇంజినీర్లకు ఈ నెల 7 తేదీన విచారణకు హాజరుకావాలని కమిషన్ విచారణకు పిలిచింది. అంతకు ముందు రోజు ఓ ఇంజినీర్ ఇన్ చీఫ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషన్ ముందు అందరూ ఒకే రకంగా చెప్పాలని చర్చ జరుగుతోంది. 45 నిమిషాల పాటు ఇంజినీర్ల టెలీకాన్ఫరెన్స్ సాగింది. ప్రభుత్వం దృష్టికి రావటంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.