గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయదారునిపై కేసు నమోదు
14-03-2026 12:38 AM
తూప్రాన్, మార్చి 13.గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ ఎస్త్స్ర గంగరాజు పోలీస్ సిబ్బంది ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ కలిసి తూప్రాన్ పట్టణంలోని ఒక బేకరీ పై అకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో గడువు ముగిసిన పలు ఆహార పదార్థాలు నిల్వ ఉంచి విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. ఈ కేసులో మహావీర్ షాప్ యజమానిపై కేసు నమోదు చేయబడింది. అనంతరం వారు మాట్లాడుతూ తూప్రాన్ లోని మిగతా బేకరీలో ఎక్స్పైరీ నిలువలు ఉంటే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.




