11 August, 2026 | 1:26 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు

22-06-2025 01:54 PM
  1. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
  2. హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై(Vijay Devarakonda) కేసు నమోదు అయింది. నటుడు విజయ్ దేవరకొండపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండపై  గిరిజన సంఘాల నేతలు రాయదుర్గం పీఎస్(Raidurgam Police Station)లో కేసు పెట్టారు. సంఘాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని  ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్  చేసింది.