17 April, 2026 | 3:13 AM

వాహనదారులపై కేసులు నమోదు

16-12-2025 07:56 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): రోడ్డుకు విరుద్ధంగా వాహనాలు నడిపిన  35 మంది వాహనదారుల పై కేసులు నమోదు చేసిన  సంఘటన  మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేఎల్ఎం సమీపంలో బోడుప్పల్ సిగ్నల్ వద్ద, డీమార్ట్ ప్రాంతం, ఉప్పల్ డిపో, స్పార్క్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుండగా రాంగ్ రూట్ లో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు, పాదచారులు, రోడ్డు వినియోగదారుల భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తున్నందున 35 మందిపై కేసులు నమోదు చేశామని, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, రోడ్డు ప్రమాదలను నివారించేందుకు చట్టపరంగా అవగాహన చర్యలు తీసుకోబడినవని మేడిపల్లి పోలీసులు తెలిపారు.