‘సర్’ను అడ్డుకుంటున్న ఎంఐఎం నేతలు
హైదరాబాద్‌లో అక్రమ వలసదారులు
భారీగా డూప్లికేట్ ఓట్లు
- ఎవరెన్ని కుట్రలు చేసినా ‘సర్’ ఆగదు
- ‘గ్రేటర్’లో నివసించేవారు ఇక్కడే ఓటరుగా నమోదు చేసుకోవాలి
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అనేక ప్రాంతా ల్లో అక్రమ వలసదారులు ఉన్నారని, డూప్లికేట్ ఓట్లు కూడా పెద్దఎత్తున ఉన్నాయని.. ఇది నిజం కాదా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎంఐఎం నాయకులను ప్రశ్నించారు. పాతబస్తీలో ఇంటింటి సర్వే కు వెళ్లిన బీఎల్‌వోలను ఎంఐఎం నాయకులు బెదిరిస్తున్నారని, తమ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్‌లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం వస్తుందన్నారు.. మజ్లిస్ నేతల కనుసన్నల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం నడవాలని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్రమ వలసదారులు ఉన్నారనే విషయం గతంలో అనేక కేసుల ద్వారా బయటపడిందన్నారు. కొంతమంది జైళ్లలో కూడా ఉన్నారని, వారిలో చాలామందికి ఓటరు గుర్తింపు, ఆధార్, రేషన్ కార్డులు కూడా ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ వాస్తవాలను పక్కనబెట్టి, ఓటర్ల జాబితా శుద్ధి ప్రక్రియను అడ్డు కునే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరింత ఆందోళన కలిగిస్తోందని, సర్ ప్రక్రియను మతంతో ముడిపెట్టడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తగదన్నారు. ఎవరు వ్యతిరేకించినా సర్ కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు.
‘సర్’లో రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందే..
సర్ ప్రక్రియలో పాల్గొంటున్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఎల్‌వోలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక యంత్రాంగం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాల్గొంటుదన్నారు. వీరి పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. సర్‌లో పాల్గొన్న సిబ్బందిని బెదిరించడం, రాజకీయ ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యాని కి మంచిది కాదన్నారు.
ఇది ఏ ప్రభుత్వానికో, ఏ రాజకీయ పార్టీకో సంబంధించిన అంశం కాదని, పూర్తిగా భారత ఎన్నికల సంఘం నిర్వహించే రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర ప్రక్రియ అన్నారు. అర్హత ఉన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలి, అదే సమయంలో అర్హత లేని, చనిపోయిన, డూప్లికేట్, సరైన ఆధారాలు లేని ఓటర్లను తొలగిస్తారని పే ర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
కానీ, కొన్ని పార్టీలు సర్ ప్రక్రియను రాజకీయ కోణంలో చూస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఓటరు జాబితా సమగ్ర సరవణ చేపట్టిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా పెరిగిందన్నారు.
నిజమైన భారత పౌరుడు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి సర్ అద్భుతమైన కార్యక్రమం అని, ప్రజలంతా స్వచ్ఛందంగా సహ కరించాలని కోరారు. తెలంగాణలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమో దు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు భయమెందుకు?
ఓటరు జాబితా సమగ్ర సవరణపై కాంగ్రె స్, బీఆర్‌ఎస్ పార్టీకు భయం ఎందుకని అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను చైతన్యపరచాల్సిందిపోయి, దుష్ప్రచారం చేయడం సరి కాదన్నారు. ఎంఐఎం మద్దతు కోసం కాం గ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దిగజారుతున్నా యో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సర్ ప్రక్రియను పౌరసత్వంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఓటు ఉంటే గ్రామంలో పింఛన్ రాదు, రేషన్ కార్డు రాదు, భూమి పోతుంది, సంక్షే మ పథకాలు నిలిచిపోతాయి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చే శారు.
1977లో దేశంలో అత్యవసర పరిస్థితి తర్వా త జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయిగా నిలిచాయని, ఆ సమయంలో కూడా ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ప్రజల తీర్పును ప్రతిబింబించిందన్నారు. సర్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉద్యోగులను, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ వారికీ అండగా నిలుస్తుందని, భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు.. ఎవరు ఒత్తిడి తెచ్చినా మీ రు మీ విధులను నిర్వహించాలని సూచించారు.
బీఎల్‌వోలతో చీరల పంపిణీయా?
బీఎల్‌వోలతో ఎన్నికల ప్రక్రియకు సం బంధంలేని కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాల్లో వారిని వినియోగించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే బీఎల్‌వోలకు ఇవ్వాల్సిన ఐడీ కార్డులు ఎన్నికల సం ఘం పేరుతో కాకుండా, కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వం పేరుతో జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఈ ప్రక్రి యను అమలు చేయాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌ను రక్షించండి
హైదరాబాద్‌కు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు తమ ఓటు హక్కును ఇక్కడే నమోదు చేసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. పేదలు, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తిదారులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వివరించా రు. వీరిలో భయాందోళనలు సృష్టించేదుకు గ్రామంలో ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు పోతాయని, భూమి, పెన్షన్ పోతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ప్రస్తుత నివాసాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చని, భవిష్యత్తులో అవసరమైతే తిరిగి మీ గ్రామానికి, జిల్లాకు లేదా రాష్ట్రానికి మార్చుకునే అవకాశం ఎప్పుడైనా ఉంటుందన్నారు. ‘మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. మీ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి.
మీ పిల్లల చదువులు ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఇక్కడే జీవిస్తున్నారు. కాబట్టి మీ ఓటు కూడా ఇక్క డే ఉండాలి. నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.. మీ ఓటు హక్కును హైదరాబాద్‌లో నమోదు చేసుకోండి. హైదరాబాద్‌ను రక్షించండి’ అంటూ కిషన్ రెడ్డి కోరారు.






