30 June, 2026 | 9:50 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి

16-06-2025 12:06 AM

గద్వాల్ టౌన్ జూన్ 15: గట్టు మండలం ముచ్చోని పల్లి రిజర్వాయర్ క్రింద 5 కిలోమీటర్ల మేర వేసిన బీటీ రోడ్డు నాసిరకంగా వేసి అవినీతికి పాల్పడ్డారని అందుకు కారకులు అయిన కాంట్రాక్టర్, పర్యవేక్షణ లేని సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేయాలనీ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ అన్నారు.

ఆదివారం సభ్యులతో కలిసి ఆయన బి టి రోడ్డు ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గద్వాల నియోజకవర్గంలో అడుగడుగునా నాసిరకమైన బీటీ రోడ్లు, సిసి రోడ్లు వేసి ప్రజానాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు .ఈ విషయం పై సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పుట్ట ప్రసాద్,కృపాకర్ మార్క్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.