30 June, 2026 | 10:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు భరోసా విడుదల

16-06-2025 12:06 AM

 మంథని వ్యవసాయ సహాయ సంచకులు అంజని

మంథని, జూన్ 15 (విజయక్రాంతి) రైతులకు పెట్టుబడి సాయం గా రైతు భరోసా విడుదల కార్యక్రమం తెలంగాణ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరి నుం డి ప్రత్యక్ష ప్రసారం సోమవారం ఉంటుందని మంథని వ్యవసాయ సహాయ సంచ కులు అంజని మిశ్ర ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైతు భరోసా కి సం బంధించిన విధివిధానాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో వివరిస్తారని, అందుబాటు లో ఉన్న రైతులందరూ తమ తమ దగ్గరలో గల రైతు వేదికల వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం వీక్షించగలరని ఆమె సూచించారు. రైతు భరోసా దరఖాస్తు చేయని రైతులు కొత్త పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారికి నెల 20 లోపు సమర్పించగలరనిఆమెతెలిపారు.