కుల స్పృహ ఐక్యతే మార్గం
- అప్పుడే బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది
రాబోయే తరం రాజకీయాల్లోకి వచ్చేలా చేయాలి
ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు
హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): బహుజన కులాలకు రాజ్యాధికారం సిద్ధించాలంటే కులస్పృహ ఐక్యతే మార్గమని రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్ గార్డెన్ రూమ్‌లో మట్టి మనుషులు పత్రిక ఎడిటర్ కేబీనరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలు వ్యక్తిగత ఖర్చులకే పరిమితం కాకుండా సామాజిక స్పృహతో ఇలాంటి వేదికల్లో సమావేశాలు నిర్వహించడం అత్యవసరమన్నారు.
కుల తత్వం అంటే తన కులం మాత్రమే ఎదగాలని కోరుకోవడం కాగా, కుల స్పృహ అంటే అన్ని బీసీ కులాలను, అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను కలు పుకుని ముందుకు సాగడమేనని స్పష్టం చేశారు. వచ్చే తరాన్ని రాజకీయ వృత్తి వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడే బహుజన వర్గాల అభివృ ద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఇంకా అనేక కులా లు అసెంబ్లీ గేటు తాకని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని, కొద్దిమంది బిలియనీర్ల చేతుల్లో పెద్ద మొత్తంలో సంపద కేంద్రీకృతమైందని తెలిపారు.అగ్రవర్ణ రాజకీయాలు బహుజన వర్గాల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో కూడా ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సరైన కుల గణన లేకుండా అమలు చేశారని అన్నారు.
సామాజిక జ్ఞానం పెంపొందించుకోవడం, కుల స్పృహతో ఐక్యంగా ముందు కు సాగడం ద్వారానే మార్పు సాధ్యమని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, బీహార్‌లో సామాజిక మార్పులు స్పష్టంగా కనిపి స్తున్నాయని, అక్కడ వెనుకబడిన వర్గాల వారు అధికార స్థానాలకు ఎదుగుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, దుగ్గరి రాజేంద్ర, నర్సింహ్మారావు, కాశీ, రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ పుల్లయ్య, నాగపరిమళతోపాటు పలువురు ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
కుల గణన అనేది గుర్తింపు కోసం..
మరొక కార్యక్రమంలో పాల్గొన్న పూర్ణచంద్రరావు ‘క్యాస్ట్ సెన్సన్ అండ్ డిపెండింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రచయితలు గౌడ్ కిరణ్ కుమార్, వాహిని బిల్లు హాజరయ్యారు. టీ చిరంజీవులు, ఆళ్ల రామకృష్ణ, మెట్టు రామారావు, ఐఆర్‌ఎస్ రిటైర్డ్ బీసీ నాయకుడు సైదులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, 1931 తర్వాత భారత్‌లో సమగ్ర కుల గణన జరగకపోయినా, కులం ఇప్పటికీ విద్య, ఉపాధి, రాజకీయ అధికారంపై ప్రభా వం చూపుతోందని పేర్కొన్నారు. మనం అసమానతను కొలవకుండా దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆయన అన్నారు.
లెక్కిస్తేనే గుర్తింపు అనే భావనను ప్రస్తావిస్తూ, నమ్మకమైన కుల డేటా లేకపోవడం వల్ల ఓబీసీలు, డీనోటిఫైడ్ తెగలు మరియు ఇతర అణగారిన వర్గాలు సరైన ప్రాతినిధ్యం పొందకుండా ఉండటంతో పాటు సంక్షేమ పథకాలు తప్పుదోవ పడుతున్నాయని తెలిపారు. గణన అనంతరం విధా న సంస్కరణలు, రాజకీయ పదవులు సమం గా పంపిణీ, నిజమైన ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.




