21 April, 2026 | 4:07 AM

ఆత్మకూరులో కుల బహిష్కరణ

21-04-2026 02:25 AM

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు

మధిర, ఏప్రిల్ 20(విజయక్రాంతి): మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం రేపింది. ఈ విషయంపై ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు అదనపు కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందజేశారు.

మధిర మండలం ఆత్మకూరు గ్రామంలో గత సంవత్సరం కాలంగా కుల బహిష్కరణ పేరుతో సాటి కులస్తులను అవమానిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు పెరుమా ళ్లపల్లి మోహన్ రావు కొత్తపల్లి భాను ప్రసాద్, మేడికొండ రాజరత్నం, వినయ్ కుమార్, కిషోర్, క్రాంతి కుమార్, తిరుమల పల్లి విజయరాజు అధికారులకు ఫిర్యాదు చేశారు. కేవలం వారి పెత్తనం సాగట్లేదనే నెపంతో మమ్మల్ని కుల బహిష్కరణ చేశారని బాధితులు పేర్కొన్నారు.

నెలవారి చందా రూ 50 రూపాయలు వసూలు చేస్తూ.. వసూలు చేసిన చందాను వాళ్ల వ్యక్తిగత అవసరాలకు వా డుకుంటున్నారని ప్రశ్నించి, మేము 50 రూపాయలు ఇవ్వమన్నందకు, గ్రామంలోని కొందరు పెద్దమనుషులుగా చలామణి అవు తూ ప్రశ్నించిన కుటుంబాల వారిని, కుల బహిష్కరణ చేశామని అందరికీ చెబుతున్నారన్నారు. 

వారి ఇంటికి ఎవరు పోవద్దు, వా ళ్లతో మాట్లాడిన, వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు జరిగిన, ఎవరైనా మరణించిన, వాళ్ల ఇంటికి, లేదా అంత్యక్రియలో పాల్గొన్న, పాల్గొన్నవారు రూ.20 వేల రూపాయిలు తప్పు చెల్లించవలసి వస్తుందని, ఏమీ తెలియని అమాయకులను బెదిరిస్తూ, అలా వెలివేసిన మా కుటుంబాలకు ఎవరిని రానీకుండా కట్టడి చేస్తూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలోని ఇతర కులాల వారికి ఫలానా వాళ్లను కుల బహిష్కరణ చేసినామంటూ... అందరికీ చెప్పి, మమ్మల్ని మానసికంగా ఎంతో క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ పేరుతో మమల్ని మానసికంగా దాదాపు సంవత్సర కాలం నుంచి వేధిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి సంబంధిత అధికారులు వారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా బాధితులు విజ్ఞప్తి చేశారు.