19 May, 2026 | 3:43 AM

గంజాయిని సరిహద్దులు దాటిస్తూ.. పోలీసులకు పట్టుబడి

20-06-2024 12:29 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 19 (విజయక్రాంతి): ఎక్కడికక్కడ పోలీసులు గంజాయి రవాణాపై నిఘా ఉంచినా అక్రమార్కులు వారి కళ్లు కప్పి గుట్టుగా సరుకు రవాణా చేస్తున్నారు. పాల్వంచ, టేకులపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో దాదాపు రూ.౯౦ లక్షల విలువైన ౩.౬౦ క్వింటాళ్ల గంజాయిని పోలీసు లు పట్టుకున్నారు. ఎస్పీ రోహిత్‌రాజు వివరాలు తెలిపారు. పట్టణ పరిధిలోని జీసీసీ గోదాం ఎదురుగా బుధవారం సాయంత్రం ఎస్సై రాఘవ తన సిబ్బందితో వాహన తనిఖీ చేస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 202 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.

దాని విలువ సుమారురూ 50.55 లక్ష లు ఉంటుందన్నారు.  ఏపీలోని డొంకరాయి అటవీ ప్రాంతం నుంచి మెగావత్ జైపాల్, వికారాబాద్ జిల్లా మోమి న్‌పేట మండలం నుంచి 100 ప్యాకెట్ల గంజాయిని కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని వెంకట్యాతండా వద్ద ఎస్సై సైదా రవూఫ్ వాహన తనిఖీ చేస్తుండగా  కారులో కామారెడ్డి జిల్లా కు చెందిన పెనుగొండ వెంకటరాజు, బోదాసు తిరుపతి 158 కిలోల గంజాయిని ఒడిశా మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలిస్తూ పట్టుబడ్డారు. దీని విలువు సుమారు రూ 39.50లక్షల ఉంటుం దని ఎస్పీ వెల్లడించారు. గంజాయి రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 60 కిలోలు పట్టివేత

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి):  ఒడిశా నుంచి ఢిల్లీకి గంజా యి తరలిస్తున్న అంతర్‌రాష్ట్ర గంజా యి స్మగ్లింగ్ ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఓ నిందితుడు పట్టుబడగా, మరో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రైల్వే, రోడ్డు భద్రత విభా గం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గజపతి ప్రాంతం నుంచి దిలీప్‌కుమార్, తపన్ రూ.15 లక్షల విలువైన 60 కిలోల గంజాయి సేకరించి సికింద్రాబాద్ మీదుగా రైలు మార్గం ద్వారా ఢిల్లీకి తరలిస్తున్నారు. వీరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌కు వచ్చి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు. బుధవారం ఉదయం సికింద్రాబాద్ రెండో నెంబర్ ప్లాట్‌ఫారంలో ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడింది. దిలీప్‌కుమార్ పట్టుబడగా, తపన్ అక్కడి నుంచి పరారయ్యాడు.