25 July, 2026 | 7:01 PM

ఉపాధ్యాయురాలిగా మారిన జిల్లా కలెక్టర్

25-07-2026 06:27 PM

పాఠాలు బోధించి,  సామర్థ్యాలు పరిశీలించి 

సంతృప్తి వ్యక్తం చేసిన, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భోజనం, చదువు, క్రీడలు ప్రతి విద్యార్థి దినచర్యలో ఉండాలి

చేగుంట,(విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచి, క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం  జిల్లాలోని చేగుంట మండల పరిధిలో గల కేజీబీవీని కలెక్టర్ సందర్శించారు. ముందుగా 06,07 తరగతుల‌ విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. 08 వరకు టేబుల్స్ చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం 10వ తరగతిలో అన్ అకాడమీ తరగతులను పరిశీలించారు. ఫాస్ట్ మ్యాథ్స్, గెట్  రైట్ పుస్తకాల ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. కొన్ని కంప్యూటర్లు మరమ్మతులు గురి కాబడినవని కలెక్టర్ తెలుసుకొని వెంటనే బాగు చేయించి అందరికీ ఆన్ అకాడమీ అందుబాటులో తీసుకురావాలన్నారు. ప్రణాళికా ప్రకారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అన్నీ బోధించాలన్నారు సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని *కలెక్టర్*విద్యాశాఖ అధికారులు ఆదేశించారు .