25 July, 2026 | 7:51 PM

తొలి ఏకాదశి.. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

25-07-2026 06:46 PM

భూపాలపల్లి టౌన్,(విజయ క్రాంతి): తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అర్చన, అభిషేకం, పూలు, పండ్లు, తమలపాకులు సమర్పించి పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మెన్ నాగపురి సమ్మయ్య గౌడ్, ధర్మకర్తలు కోమల, బాలాజి, రమణాచారి, ఇస్లావత్ రవి, ఈఒ మహేష్, అర్చకులు డింగిరి రాధాకృష్ణ, మురళీకృష్ణ పాల్గొన్నారు.