25 July, 2026 | 5:48 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

20-06-2024 12:31 AM

కలెక్టర్ జితేష్ వీ పాటిల్

భధ్రాద్రి కొత్తగూడెం, జూన్ 19 (విజయక్రాంతి): వానకాలం నేపథ్యంలో జిల్లాలోని ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెం ప్రాంతా ల్లో ఆయన పర్యటించారు. చర్ల మండలంలో దండుపేట, రాళ్లగూడెం గ్రామాల్లో పర్యటించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. జిల్లాలో ఏటా వరద తాకిడి అధికంగా ఉంటున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. 

చర్ల మండలంలో దేవరపల్లి, దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల ప్రభుత్వ పాఠశాలలను ఆయన పరిశీలించారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేంపదకు ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ జీఎం, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, ఈఈ రాంప్రసాద్, డీఈ జే తిరుపతి, ఏఈ ఉపేందర్ , తహసీల్దార్లు పాల్గొన్నారు.