24 July, 2026 | 9:26 PM

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల ఆకస్మిక దాడి

24-07-2026 08:52 PM

 8 మంది అరెస్ట్, రూ.5,430 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకాని గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఆకస్మికంగా దాడి  నిర్వహించారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఆదేశాలతో జిల్లా సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది నిందితులను అరెస్టు చేయగా, వారి వద్ద నుంచి రూ.5,430 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి జరుగుతున్న సమయంలో మరో ఒక నిందితుడు పరారయ్యాడు. అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాటారం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.