24 July, 2026 | 9:24 PM

బాలానగర్‌లో విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్‌ఎఫ్‌ఐ

24-07-2026 08:54 PM

బాలానగర్: బాలానగర్ మండలం లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు బంద్‌కు సహకరించడంతో కార్యక్రమం విజయవంతమైందని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై విద్యార్థులకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువత పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో నిరుద్యోగ యువతపై జరిగిన ఘటనపై పారదర్శక విచారణ చేపట్టాలని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని కోరారు. దేశంలో విద్య కేంద్రీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వీబీఎస్‌ఏ బిల్లును రద్దు చేయాలని కోరారు. ఈ బంద్‌లో భాగంగా బాలానగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బంద్ చేశాము అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరీఫ్, సాయి ఆదిత్య, శరత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.