24 July, 2026 | 9:15 PM

Breaking News

నీట్ పేపర్ లీకేజీపై ప్రభుత్వానిదే బాధ్యత   •   నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి   •   ఖానాపూర్ పట్టణంలో స్వర్ణకార సంఘం కార్యవర్గం ఏర్పాటు   •   వైభవంగా శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం   •   కల్లూరులో పాఠశాలలు బంద్ విజయవంతం   •   దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు   •   ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్   •   మానస చిల్డ్రన్స్ హాస్పిటల్‌ తనిఖీ   •   పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల ఆకస్మిక దాడి   •   బూర్గంపాడు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా డాక్టర్ జి. ప్రసాద్ బాధ్యతల స్వీకరణ   •  

బూర్గంపాడు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా డాక్టర్ జి. ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

24-07-2026 08:44 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) నూతన మెడికల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ జి. ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత రెండేళ్లుగా సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా సమర్థవంతంగా సేవలందించిన డాక్టర్ ఎం.ముక్కంటేశ్వర్ రావు రీడిప్లాయ్‌మెంట్‌లో భాగంగా పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. వారి స్థానంలో మత్తు వైద్య నిపుణులైన డాక్టర్ జి.ప్రసాద్‌ను బూర్గంపాడు సీహెచ్‌సీ మెడికల్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎం. ముక్కంటేశ్వర్ రావు అందించిన విశిష్ట సేవలను సిబ్బంది గుర్తుచేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ జి. ప్రసాద్ అధికారికంగా బాధ్యతలు చేపట్టి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.