2 September, 2026 | 1:40 AM

శ్రీరామ్ కాలనీలో 32 సీసీటీవీ కెమెరాలు ప్రారంభం

02-09-2026 | 12:00am

బాలాపూర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా శ్రీరామ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 32 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఆర్జిఐఎ  డివిజన్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మరియు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. లక్ష్మీ నారాయణ రెడ్డి స్థానిక ప్రజలతో కలసి ప్రారంభించారు.

శ్రీనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కమ్యూనిటీ దాతలు అందించిన ఆర్థిక సాయంతో ఈ కెమెరాల ఏర్పా టు జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీ కాంత్ గౌడ్ మాట్లాడుతూ... ప్రాంతంలో ని ఘాను పటిష్టం చేయడం, నేరాలను ముందస్తుగా అరికట్టడం మరియు పౌరులకు పూర్తి భద్రత కల్పించడమే ఈ చొరవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

కమ్యూనిటీ పోలీసింగ్ సమాజంలో నేరాల నియంత్రణకు ఎంతో దో హదపడుతుందన్నారు. పోలీసు యంత్రాంగానికి తోడ్పాటు అందిస్తూ సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన దాతలను, స్థానిక పారిశ్రామికవేత్తలను ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి అభినందించారు. శ్రీరామ్ కాలనీని నేరరహిత, సురక్షిత ప్రాంతంగా మా ర్చేందుకు భవిష్యత్తులోనూ ప్రజలు ఇదే రకమైన సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు మరియు కాలనీ నివాసితులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.