calender_icon.png 19 July, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బొక్క మన్మోహన్‌రెడ్డికి ప్రముఖుల నివాళి

16-07-2025 12:15:28 AM

తుర్కయంజాల్, జూలై 15:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్లో అనారోగ్యంతో చనిపోయిన సీనియర్ నాయకులు బొక్క మన్మోహర్రెడ్డి పార్థివదేహానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నివాళులర్పించారు. మన్మోహన్ భౌతికకాయంపై పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా మన్మోహన్ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. హయత్నగర్ మాజీ ఎంపీపీగా, తుర్కయంజాల్ ఎఫ్‌ఎస్సీఎస్ మాజీ చైర్మన్గా మన్మోహన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు అందుకున్న ఘనత మన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. నివాళులర్పించిన వారిలో సీనియర్ నాయకులు రొక్కం భీంరెడ్డి, గుండ్లపల్లి ధన్రాజ్గౌడ్, జక్క రాంరెడ్డి, పోరెడ్డి నర్సింహారెడ్డి, బొక్క గౌతమ్రెడ్డి, సంరెడ్డి సత్తిరెడ్డి, పన్నాల మధుసూదన్రెడ్డి, బొక్క వంశీధర్రెడ్డి తదితరులున్నారు.