16-07-2025 12:16:50 AM
బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్
భద్రాద్రికొత్తగూడెం, జులై 15 (విజయక్రాంతి) : ఆగస్టు నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లో జరగనున్న జాతీయ సబ్ జూనియర్స్ బాలురు,బాలికల పోటీలలో భాగంగా ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సబ్ జూనియర్స్ బాలురు,బాలికల బాక్సింగ్ టీమ్ లను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్ తెలిపారు.
మంగళవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన బాక్సింగ్ జిల్లా సర్వసభ్య సమావేశంలో కామేష్ మాట్లాడుతూ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్స్ 30కేజీల నుండి 70 కేజీల వరకు 15 విభాగాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్టు ఎంపిక చేసి జాతీయ సబ్ జూనియర్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కావున అర్హత కలిగిన బాక్సర్లు ఈనెల 20వ తేదీ ఆదివారం ఉదయం 8గంటల లోపు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో రెండు జిల్లాల బాక్సింగ్ క్రీడాకారులు వయస్సు నిర్ధారణ ధ్రువపత్రం తీసుకుని హాజరు కావాలనీ కోరారు.
పూర్తి వివరాలకు కోచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ.ఈశ్వర్ కు సెల్ నెంబర్ 7893669676, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్ 9885442131,ఖమ్మం జిల్లా వివరాలకు మాలోత్ రాజా 9949083202 కు సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమంలో బాక్సింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా,జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డీ షమీ ఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివసుబ్రమణ్యం, సీనియర్ బాక్సర్ మాలోత్ గౌతమ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.