16-07-2025 12:14:28 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 15, (విజయక్రాంతి): యువత రక్తదానం ను ఆదర్శంగా తీసుకొని రక్తదానం చేసి జీవితాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పా టిల్ పిలుపు నిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహి త్ రాజు నేతృత్వంలో జిల్లా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణంలో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత రక్త పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత రక్త పరీక్ష శిబిరంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రజలు తమ యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం సులభతరం అవుతుందన్నారు. దీని ద్వారా అత్యవసర సందర్భాల్లో రక్తదానం చేసేందుకు సులభంగా ఉంటుందని, అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున ఈ ఉచిత రక్త పరీక్ష శిబిరం ని ఉపయోగించుకొని తమ బ్లడ్ గ్రూపు వివరాలను తెలుసుకోవాలని కోరారు.
ముఖ్యంగా యువత రక్తదానం కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని ఆపద కాలంలో రక్తదానం చేసి జీవితాలను నిలబెట్టాలని కలెక్టర్ కోరారు. ఈ రక్త పరీక్ష తేదీ కేంద్రంలో తాను కూడా రక్తపరీక్ష చేయించుకున్నానని అత్యవసర సమయంలో రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ తెలిపారు. ఈ ఉచిత రక్త పరీక్ష శిబిరం ద్వారా తమ బ్లడ్ గ్రూపు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇలా తెలుసుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తికి సహాయం చేయడమే కాకుండా తన యొక్క బ్లడ్ గ్రూప్ పై అవగాహన ఉండటం స్వీయ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ యొక్క బ్లడ్ గ్రూప్ సంబంధిత వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్టీవో వెంకటరమణ,మనోహర్, వెంకట పుల్లయ్య, డీఎస్పీ రెహమాన్, ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.