28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెలు

11-09-2024 12:09 AM

అజ్మీర్‌లో గూడ్స్ ట్రైన్‌ను పట్టాలు తప్పించే యత్నం

దిమ్మెలను ఢీకొట్టినా పట్టాలు తప్పకుండా వెళ్లిన రైలు

అజ్మీర్ (రాజస్థాన్), సెప్టెంబర్ 9: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజస్థాన్‌లోని శారధన, బంగడ్ స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం ఓ గూడ్స్ రైలు క్రాస్ అవుతుండగా కొందరు దుండగులు ట్రాక్‌పై దాదాపు 70 కిలోల బరువుండే రెండు సిమెంట్ దిమ్మెలను ఉంచారు. రైలు ఆ దిమ్మెలను ఢీకొట్టినప్పటికీ పట్టాలు తప్పకుండా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఢీకొనడంతో ఓ సిమెంట్ దిమ్మె పగిలిపోగా మరొకటి ట్రక్‌పైనే దూరం జరిగి ఉంది. రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించారు. కాగా రెండు రోజుల కిందట యూపీ కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్ మార్గంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు కొందరు సిలిండర్ ఉంచిన ఘటన సంచలనం సృష్టించింది.