మా ఇంటి బంగారం సెన్సార్ పూర్తి
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజాచిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి తన సొంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్ ్సలో సమంత నిర్మించారు. ఇందులో సమంతతోపాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ముఖ్యపాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, ఓం ప్రకాశ్ కెమెరామెన్‌గా, లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది.






