12 June, 2026 | 2:30 AM

భారతీరాజాకు కన్నీటి వీడ్కోలు

12-06-2026 12:44 AM

దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) అంత్యక్రియలు గురువారం భావోద్వేగభరిత వాతావరణంలో ముగిశాయి. చెన్నైలో బుధవారం తుదిశ్వాస విడిచిన భారతీ రాజా భౌతికకాయాన్ని ఆయన కోరిక మేరకు స్వగ్రామానికి తరలించారు. తమిళనాడు కొడైకెనాల్ సమీపంలోని వత్తలగుండు ఘాట్ రోడ్డులో ఉన్న ఆయన సొంత ఎస్టేట్‌లో అంతిమ సంస్కారాలు భార్య చంద్రలీల చేతుల మీదుగా జరిగాయి. కుమార్తె జనని పాల్గొన్నారు.

తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఆయన పార్థివదేహానికి నివాళులర్పిం చేందుకు చెన్నైలోనూ, తేనిలోని ఆయన ఫామ్‌హౌస్ వద్దకు భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కోలీవుడ్ ప్రముఖులు లు కడసారి చూపు కోసం తరలివచ్చారు. భారతీరాజా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా నివాళు లర్పించారు. తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ ఆర్లేకర్‌తోపాటు టాలీవుడ్ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల రాజకీయరంగ ప్రముఖులు సంతాపాలు తెలిపారు.