calender_icon.png 20 February, 2026 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మాధవరం పుట్టినరోజు వేడుకలు

20-02-2026 12:00:00 AM

విద్యార్థులకు పెన్ను, ప్యాడ్‌లు, మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ

సికింద్రాబాద్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): పేద ప్రజల ఆశాజ్యోతి, మనసున్న మారాజు, అన్నా అంటే నేనున్నానని పలికి మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసు స్పూర్తిగా కోరుకుంటూ,ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్పేట్ ఎస్సీ బస్తీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్య క్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓల్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నాలు, ప్యాడ్‌లను అలాగే పేద,వృద్ధులు, ఒంటరి మహిళలకు చీరలను కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ డివిజన్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.