07-12-2025 12:58:43 AM
* ఇండిగో సర్వీసుల సంక్షోభం తలనొప్పిగా మారడంతో శనివారం కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐదు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఆదివారం రాత్రిలోపు టికెట్‌ల సొమ్ము రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఇండిగో సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో ఇతర విమాన సర్వీసులు టికెట్ చార్జీలు పెంచడంపై కేంద్రం సీరియస్ ఆయ్యింది. టికెట్ చార్జీలపై పరిమితి విధించింది. త్వరలో ఇండిగో సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను తప్పించాలని కేంద్రం, ఇండిగో బోర్డుకు ఆదేశాలు జారీ చేయవచ్చునని భావిస్తున్నారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఐదురోజులుగా ఇండిగో సర్వీసులకు అంతరాయం, రద్దు అంశం విమాన ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. కొద్దిరోజులుగా ఈ విమా నాయన సంస్థ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే శనివా రం కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల పరిధిలో 500 సర్వీసులకు పైగా రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
ఇండిగో సంక్షో భంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పందించింది. ఆదివారం రాత్రిలోపు ప్రయాణికుల టికెట్ల సొమ్ము రీఫండ్ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిం చినా, రీఫండ్ చేయకపోయినా చర్యలు తప్పవని, అవసరమైతే భారీ జరిమానా సైతం విధిస్తామని హెచ్చరించింది. విమాన సర్వీసుల అంతరాయంపై కేంద్రం ఇప్పటికే ఉన్న తస్థాయి విచారణకు ఆదేశించింది. అందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పా టు చేసింది.
మరోవైపు ఈ అంశంపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. పీఎంవో కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే విమాన సర్వీసుల రద్దుపై స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వశాఖతోపాటు డీజీసీఏకు కోర్టు ఆదేశాలివ్వాలని ఓ పిటిషనర్ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ కోసం ప్రత్యేక బెంచ్ కేటాయించాలని కోరారు. ఈ పిల్‌పై సుప్రీం కోర్టు విచారణకు అనుమతించినట్లు సమాచారం.
ఇండిగో సంక్షోభానికి కారణంగా గత నవంబర్‌లో ఫ్లుటై డ్యూటీ టైం లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) మార్గదర్శకాలే కారణమని పౌర విమానయానశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ మార్గదర్శకాల ప్రకారం ఇండిగో సంస్థ అవసరం మేరకు పైలట్లను సమకూర్చుకోలేకపోయిందని తెలిపారు.
ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆదివారం రాత్రి 8:00 గంటలలోపు ప్రయాణికులకు సంబంధించి టిక్కె ట్ సొమ్మును రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోయినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠి న చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సీఈవోపై చర్యలు?
ఇండిగో సంస్థ వైఫల్యాలను కేంద్ర ప్రభు త్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీనిలో భాగంగానే త్వరలో సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను ఆ బాధ్యతల నుంచి త ప్పించాలని ఇండిగో బోర్డుకు ఆదేశాలు జా రీ చేసే అవకాశాలున్నాయి. డీజీసీఏ ఈ క్రమంలోనే సీఈవోకు నోటీసులు జారీ చేసింది. వైఫల్యాలపై 24 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సంస్థ కు భారీగా జరిమానా విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటికే సంస్థ బోర్డు సభ్యులతో చర్చించినట్లు తెలిసింది. ‘జీరో ఇన్‌కన్వీనియన్స్ పాలసీ’ అమలు చేయాలని తేల్చిచెప్పింది.
పీఎం మోదీ ఆరా
ఇండిగో సంక్షోభంపై స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) రంగంలోకి దిగింది. విమాన సర్వీసుల అంతరాయంపై ప్రధాని మోదీ సైతం ఆరా తీశారు. ఈమేరకు పీఎంవో అధికారులు ఎప్పటికప్పుడు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులు పూర్తిగా చేతుల్లోకి వచ్చేందుకు మరో 10 రోజుల సమ యం పడుతుందని సీఈవో వారికి బదులిచ్చినట్లు తెలిసింది.
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం పై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. బృందంలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సం జయ్ కే బ్రహ్మానే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లుటై ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్‌గ్లిక్, ఫ్లుటై ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ లోకేశ్ రాంపాల్ కూడా ఉన్నారు.
89 రైళ్లకు 2౦౦ అదనపు బోగీలు
ఇండిగో విమాన సేవల అంతరాయం కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ౮౯ రైళ్లకు సంబంధించి ౨౦౦కి పైగా కోచ్‌లు అదనంగా పెంచింది. ఇప్పటికే కొన్ని రైళ్లు అదనపు కోచ్‌లతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
శంషాబాద్ పరిధిలో 89 సర్వీసులు రద్దు
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో వరుసగా ఐదోరోజు కూడా ఇం డిగో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, హైదరాబాద్ నుంచి ఇతర చోట్లకు వెళ్లాల్సిన 43 విమానాలు రద్దయ్యాయి. అలాగే విశాఖపట్నంలోని విమ నాశ్రయం నుంచి తొమ్మిది విమాన సర్వీసులు రద్దయ్యాయి.
సుప్రీంకోర్టుకు చేరిన వివాదం
ఇండిగో విమాన సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసు కోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ అంశంపై వెంటనే అత్యున్నత న్యాయస్థానం స్పందించి స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌ ర విమానయాన మంత్రిత్వశాఖతోపాటు డీజీసీఏకు కోర్టు ఆదేశాలివ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. విచారణ కోసం ప్రత్యేక బెం చ్ కేటాయించాలని కోరారు.
నిర్లక్ష్యంగా సమాధానాలు
విమాన సర్వీసుల రద్దు అంశంపై చెన్నై విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందిని ప్రశ్నిస్తే, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, డిస్‌ప్లే బోర్డులపై యథాతథంగా విమాన సర్వీసులు నడుస్తున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి. ఏం జరు గుతుందో తెలియక మేం తెల్లమొహం వేశాం..’ అని ఓ మహిళా ప్రయాణి కురాలు వాపోయింది. ఇలా సర్వీసుల రద్దుపై ఎక్కడి కక్కడ ప్రయాణికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘మానాన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేను చికిత్స చేయించేందుకు ఢిల్లీ తీసు కెళ్తున్నాను. ఇంతలోనే విమాన సర్వీసు రద్దయింది. అని ఓ యువకుడి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉద్యోగం తీసేయొద్దని చెప్పండి
ఇండిగో విమాన సర్వీసుల రద్దు పై ఓ ప్రైవేటు ఉద్యోగి ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. ‘నేను అర్జెంట్‌గా ఆఫీసుకు వెళ్లి బాస్‌ను కలవాల్సి ఉంది. విమాన సర్వీస్ రద్దు కావడంతో నేను చేరుకోలేకపోతున్నాను. దయచేసి మా బాస్‌కు చెప్పండి.. నన్ను ఉద్యోగం నుం చి తొలగించొద్దని’ అంటూ భావోద్వేగానికి గురవుతూ వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నివేదిక అధారంగా చర్యలు:
ఇండిగో విమాన సర్వీసుల అంతరాయంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించా మని, కమిటీ నివేదిక అందాక తదుపరి చర్య లు తీసుకుంటామని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజారపు రామ్మో హన్ నాయుడు స్పష్టం చేశారు. సంస్థ తక్షణం ప్రయాణికుల సొమ్ము రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు