calender_icon.png 7 December, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డీప్ ఫేక్’ నియంత్రణకు ప్రైవేటు బిల్లు

07-12-2025 01:11:55 AM

- లోక్‌సభలో ప్రవేశపెట్టిన శివసేన ఎంపీ శ్రీకాంత్

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రస్తుతం క్రీడాకారులు, సినీస్టార్స్ వంటి సెలబ్రెటీలు ఎదు ర్కొం టున్న అతిపెద్ద సమస్య డీప్‌ఫేక్. కృత్రిమమేధ  (ఏఐ) రంగం నానాటికీ తన పరి ధుల్ని విస్తృపరచుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డీప్ ఫేక్ నియంత్రణకు శనివారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ కట్టడికి అవసరమైన న్యాయపరమైన నిబంధనలు రూపొందేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. ఎవరికి సంబంధించిన వీడియో రూపకల్పన చేయాలనుకున్నారో, కంటెంట్ క్రియే టర్ మున్ముందు ఆ వ్యక్తి నుంచి అనుమతి తీసుకావాల్సి ఉంటుందని తెలిపారు. దురుద్దేశంతో కంటెంట్ సృష్టించినా, ఫార్వర్డ్ చేసి నా శిక్షలు పడాలన్నారు.