1 July, 2026 | 8:13 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు అపహరించిన దుండగులు

01-06-2025 09:01 AM

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం: రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధురాలి మెడలోంచి బంగారు పుస్తెలతాడను(Chain snatching) గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (70), ఇబ్రహీంపట్నం మంచాల్ రోడ్డులో ఉదయం ఆకుకూరల మార్కెట్ నుండి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలోంచి సుమారు 3 తులాల పుస్తెలతాడను గుర్తు తెలియని దుండగులు అపహరించి అక్కడి నుంచి ఊడయించారు. చోరీకి పాల్పడిన వారు కారులో వచ్చినట్లు సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.