22 August, 2026 | 12:08 PM

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

01-07-2026 07:46 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయ రమణారావు బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు చేశారు.  ప్రజలందరినీపోచమ్మ తల్లి చల్లంగా చూడాలంటూ ఆ తల్లిని వేడుకోవడం జరిగిందని విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భం గా మాజీ ఎంపిటిసి పన్నాల హనుమక్క రాములు, మాజీ సర్పంచ్ పన్నాల తిరుపతి, ఉప సర్పంచ్  మహేష్ తో పాటు పలువురు విజయరమణారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.