17 April, 2026 | 3:30 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శ్రీ భద్రకాళి అమ్మవారికి చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు

04-02-2026 07:23 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ లోని శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని బుధవారం ఉదయం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వెంకట్రాంరెడ్డి దంపతులకు ఆలయ ధర్మకర్తలు, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శనం అనంతరం ఆలయ మహామండపంలో భద్రకాళి శేషు ఆధ్వర్యంలో  అర్చకులు, వేదపండితులు మహాదాశిర్వచనం నిర్వహించి, అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి, ప్రసాదములు అందజేశారు.