30 June, 2026 | 9:28 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్

30-06-2026 08:57 PM

ఇండ్లు లేని పట్టణ పేదలు దండుగా కదలిరావాలి

పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఇండ్లు లేని నిరుపేదలు అందరికీ తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని, పేదల ఇండ్ల సమస్యల పరిష్కారం కోసం జులై 1న నిర్వహించే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని, సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో సిపిఐ కొత్తగూడెం పట్టణ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లకు వెంటనే ఇంటి నెంబర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేదల ఇండ్ల అక్రమ కూల్చివేతలను పాలకులు, అధికారులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్ల సాధనకై సిపిఐ, సిపిఎం, న్యూ డిమోక్రసీ, మాస్ లైన్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా ఉంటుందని వెల్లడించారు. ఈ పోరాటంలో ఇండ్లు లేని పట్టణ పేదలందరూ దండుగా కదలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు.