21 August, 2026 | 7:30 PM

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం

30-06-2026 09:02 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సహకార వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ, నాగనారాయణ మాట్లాడుతూ సహకార సంఘాలు, ఎఫ్‌పీఓలు సమన్వయంతో పనిచేస్తే రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని, ఎఫ్‌పీఓలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎఫ్‌పీఓల ఏర్పాటు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, సహకార సంఘాల బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పీఏసీఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, డైరెక్టర్లు  పాల్గొన్నారు.