26 May, 2026 | 1:55 AM

ప్రెసిడెంట్‌గా చాముండేశ్వరనాథ్

26-05-2026 12:00 AM

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికలు ఏకగ్రీవం

హైదరాబాద్, మే 25 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబా ద్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్, మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఒంటెద్దు శ్రీనివాస్‌రెడ్డి, ఇందుకూరి సోమరాజు, ఆదినారాయణ కమ్మ, జాస్తి శారదా గోవర్థిని, పారుపల్లి కశ్య ప్ ఎన్నికయ్యారు.

ఇక కార్యదర్శిగా కానూరి వంశీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గున్ను విజ య్ రాఘవన్, కోశాధికారిగా కొల్లి నాగవేణి, సంయుక్త కార్యదర్శులుగా చిట్టిబోయిన రమే శ్ యాదవ్, గంటా శారదారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులుగా జయేశ్ రంజన్, బంగారు బాబు, బాంబోజి రాజగోపాల్ చా రి, సిద్దార్థ్ రెడ్డి ఆరమ్‌రెడ్డి, మక్దూమ్ అహ్మద్ ఖాద్రి, తారా ప్రశాంత్ చంద్ర, పల్లె చంద్రశేఖర్‌రావు, వంకిన రమ్య, నామాల పురుషో త్తమరావు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి బీవీ పద్మారెడ్డి తెలిపారు.

కాగా ఇప్పుడు ఎన్నికైన కార్యవర్గం నాలుగేళ్ల పాటు (2026-30) వరకూ పనిచేయనుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని చాముండేశ్వరనాథ్ తెలిపారు. బ్యాడ్మింటన్ హబ్‌గా మారిన హైదరాబాద్ నుంచి రానున్న రోజుల్లో మరింత మంది ఛాంపియన్లు వస్తారని, ఇప్పటికే మౌలిక వసతులు కల్పించామన్నారు.