29 August, 2026 | 7:42 PM

ఆన్ లైన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి

29-08-2026 05:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): సెన్సస్ హ్యాండ్ బుక్ మ్యానువల్ సమాచారం మొత్తాన్ని ఆన్ లైన్ చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం నిజామాబాదు నుంచి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలాలు, మున్సిపాలిటీల వారిగా ఇప్పటివరకు సేకరించిన నిర్దేశిత సమాచారం. ఇంకా  సేకరించాల్సిన వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

సేకరించిన సమాచారాన్ని మొత్తం నిర్దేశిత ప్రొఫార్మాలో ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. సేకరించే, ఆన్ లైన్ చేసే సమాచారం మొత్తం తప్పులు లేకుండా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఈ వీసీలో జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సిపిఓ గంగారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.