29 August, 2026 | 5:55 PM

పులాజి బాబా జయంతి ఉత్సవం

29-08-2026 05:19 PM

ఉట్నూర్, ఆగస్టు 29 ( విజయక్రాంతి ): ఆంద్  గిరిజనుల ఆధ్యాత్మిక గురువు సద్గురు పులాజి బాబా జయంతి ఉత్సవాలను ఆదివారం కొమరం భీం జిల్లా  జైనూర్ మండలంలోని  పట్నాపూర్ లో  నిర్వహించినట్లు  ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, ఆదివాసి ఆంద్  సేవా సంఘం అదిలాబాద్ జిల్లా శాఖ  అధ్యక్ష, కార్యదర్శులు  ముకాడే విష్ణు, కరాటే మారుతీలు తెలిపారు.

అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జయంతి వేడుకకు  ఆదివాసి ఆంద్ సేవా సంఘం  ప్రతినిధులతోపాటు  ఆంద్  గిరిజనులు  పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శనివారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో  మంద మకరందును  ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు   ఆహ్వానించారు. వారితోపాటు  అందు గిరిజనులు పాల్గొన్నారు.