29 August, 2026 | 7:12 PM

కలెక్టరేట్లో క్రీడా దినోత్సవం

29-08-2026 05:28 PM

నిర్మల్ ఆగస్టు 29 ( విజయ క్రాంతి): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి వేడుకలను నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా  నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో ధ్యాన్‌ చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి బి. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత హాకీకి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ చేసిన కృషి, ఆయన ప్రతిభ, అంకితభావం చిరస్మరణీయమని అన్నారు.

ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాథోడ్‌ లక్ష్మణ్, పీడీలు రమణారావు, రవీందర్‌ గౌడ్, అన్నపూర్ణ, భూమన్న, సత్తయ్య, బుచ్చిరామారావు, సుధార్‌ సింగ్, పోశెట్టి, వంశీ, కె. శ్రీనివాస్, పీఈటీలు సంజీవ్, గంగాధర్, ముకేష్, భీమేశ్, గిరి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, పాల్గొన్నారు