23 August, 2026 | 12:26 AM

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చందానగర్ పోలీసులు

22-08-2026 11:41 PM

భూ వివాదంలో డబ్బు డిమాండ్ 

ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అడ్మిన్ సబ్ ఇన్‌స్పెక్టర్ బాలరాజు, కానిస్టేబుల్ రాఘవ, కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌లను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సెటిల్‌మెంట్ విషయంలో ఓ బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ బృందం రంగంలోకి దిగింది.

లంచం తీసుకుంటున్న సమయంలోనే ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. భూ వివాదాలను పరిష్కరించే పేరుతో పోలీసు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పట్టుబడిన వారిని విచారించడంతోపాటు, లంచం డిమాండ్‌కు సంబంధించిన మొత్తం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.