23 August, 2026 | 1:54 AM

బీజేపీ ఎండోమెంట్ ధార్మిక విభాగం సహాయ సమన్వయకర్తగా శేపూరి మురళి

23-08-2026 12:11 AM

మహబూబ్‌నగర్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ధార్మిక విభాగం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 22వ వార్డు సహాయ సమన్వయకర్తగా శేపూరి మురళి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎండోమెంట్ ధార్మిక విభాగం కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ నియామక ఉత్తర్వులను అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ కొత్తకోట కిరణ్‌కుమార్ రెడ్డి, 22వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి మర్రి జ్యోతితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని శేపూరి మురళిని అభినందించారు. మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీ ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అనేక దేవాలయాలు కొలువుదీరి ఉండటంతో నిత్యం వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది.

ఇలాంటి ప్రాంతానికి చెందిన శేపూరి మురళికి ధార్మిక విభాగంలో బాధ్యతలు దక్కడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల అభివృద్ధికి మురళి తనదైన శైలిలో పనిచేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆధ్యాత్మిక భావాలు, సేవా దృక్పథం కలిగిన వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడం సముచిత నిర్ణయమని పలువురు పేర్కొన్నారు.