9 April, 2026 | 6:29 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్

09-04-2026 05:01 PM

భూమి దక్కితేనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన సిద్ధాంతకర్త

 ప్రజా ఉద్యమాల నిర్మాణమే రాజేశ్వర్ రావుకు ఇచ్చే ఘనమైన నివాళి

 సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టి నిరుపేదల జీవనోపాధి కల్పించిన చండ్ర రాజేశ్వర్ రావు చిరస్మరణీయుడని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్టు పార్టీ పితామహుడు చండ్ర రాజేశ్వర్ రావు వర్ధంతిని గురువారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తొలుత సిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. జమీందారీ కుటుంబంలో జన్మించిన రాజేశ్వర్ రావు, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై తన యావదాస్తిని పేదలకు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

మహిళలపై దాడులు, అరాచకాలను అరికట్టేందుకు, ఉద్యమాలను అణచివేసే ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆరు దశాబ్దాల క్రితమే ఆయన 'జనసేవాదళ్‌'ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.  సుదీర్ఘకాలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ, అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడిపి నిరాడంబరతకు మారుపేరుగా సిఆర్ నిలిచారన్నారు. నేటి రాజకీయ వాతావరణంలో ఆయన విలువలు, క్రమశిక్షణ ఎంతో అవసరమని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, రమణమూర్తి,  తదితరులు పాల్గొన్నారు.