ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణం
హైదరాబాద్, జూన్ 21(విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సభలో మొదట సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నా యుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, ఎన్‌ఎండి ఫరూక్ ప్రమాణం చేశారు. పోంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసం సెట్టి సుభాష్ తదితరులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు.






