2 August, 2026 | 10:05 PM

16 కొత్త కేజీబీవీలు!

22-06-2024 01:57 AM
  • కాంగ్రెస్ సర్కారు నిర్ణయం

ఈ సంవత్సరం నుంచే నిర్వహణ

6, 7 తరగతులకు అనుమతి

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా మరో 16 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 2024 విద్యాసంవత్సరం నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలు కూడా చేపట్టారు. అడ్మిషన్ల ప్రక్రియ కూడా చేపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కేజీబీవీలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో వీటిని ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న 16 కేజీబీవీల్లో 6, 7 తరగతులకు అనుమతిచ్చారు.   2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017 కొత్తగా మరో 84 , గతేడాది నాలుగు, ఇప్పుడు 16తో కలిపి వీటి సంఖ్య 495 వరకు చేరింది. 

కొత్త కేజీబీవీలు ఇవే

బీంపూర్(ఆదిలాబాద్), సారంగాపూర్(జగిత్యాల్), ధర్మపురి(జగిత్యాల్), ఎల్‌గందల(కరీంనగర్), తిమ్మాపూర్(కరీంనగర్), నర్సింలుపేట్(మహబూబాబాద్), చేగుంట(మెదక్), రామాయణపేట్(మెదక్), శంకరంపేట్(మెదక్), ఎల్దుర్తి(మెదక్), నిజామాబాద్(నిజామాబాద్), మోపల్(నిజామాబాద్), నారాయణఖేడ్(సంగారెడ్డి), ఆందోల్(సంగారెడ్డి) కొమురవెల్లి(సిద్ధిపేట్), కుల్కచర్ల(వికారాబాద్).