15 July, 2026 | 2:41 AM

ప్రధానితో చంద్రబాబు భేటీ

05-07-2024 01:10 AM

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఈ నెల చివరి వారంలో  కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమం త్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సా యం, వివిధ అంశాలపై చర్చించారు. కష్టా ల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించారు. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందిం చాలని కోరారు. అమరావతి  ఎక్స్‌ప్రెస్ హై వే నిర్మాణంతో పాటు కీలక రహదారులు మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల, ఇళ్లు ,జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరసఫరా వంటి ముఖ్యమైన అంశాల పై విజ్ఞప్తులు చేశారు.