నానో మెటీరియల్స్‌కు ప్రాధాన్యమెక్కువే
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): నానో మెటీరియల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని, వాటిపై విశే ష పరిశోధనలు జరుగుతున్నాయని డె న్మార్క్‌లోని సదరన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోగేంద్రకుమార్ మిశ్రా అన్నారు. గురువారం రుద్రారంలోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో ‘అధునాతల సాంకేతికతల కోసం టెట్రాపోడ్స్ ఆధారిత స్మార్ట్ మెటీరియల్స్’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ 3డీ నానో మెటీరియల్స్ అభివృద్ధిలో సంక్లిష్ట ఆకారపు నానో స్ట్ర క్చర్ల ప్రాముఖ్యాన్ని వివరించారు.
జింక్ ఆక్సైడ్ టెట్రాపోడ్‌లను సంశ్లేషణ చేయ డం కోసం జ్వాల ఆధారిత సింగిల్ స్టెప్ విధానాన్ని ప్రస్తావించారు. ఈ టెట్రాపోడ్‌లు అనువైన సిరామిక్స్ రూపంలో సూ క్ష్మరంధ్రం గల పరస్పరం అనుసంధానించిన 3డీ నానోనెట్‌వర్క్‌లను రూపొందిం చడానికి అనుకరణా లుగా ఉపకరించడం తో పాటు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను కల్పిస్తాయ న్నారు. అనంతరం స్మార్ట్ మెటీరియల్స్ రంగంలో చేసిన కృషిని అభినందిస్తూ గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సయన్ చౌధురి, భౌతిక, రసాయన శాస్త్రాల విభాగాధిపతులు ప్రొఫెసర్ టీ విశ్వం, డాక్టర్ గౌసియాబేగం తదితరులు ప్రొఫెసర్ మిశ్రా ను సత్కరించారు.






