15 July, 2026 | 2:34 AM

ఆ మాయా ఖడ్గం ఎక్కడ?

05-07-2024 01:17 AM
  • మాయమైన 1300 సంవత్సరాల పురాతన ఖడ్గం
  • ఎవరైనా చోరీ చేశారా అనే కోణంలో విచారణ
  • 100 అడుగుల రాయి నుంచి ఎత్తుకెళ్లిన దుండగులు
  • ఆందోళన చెందుతున్న స్థానికులు

ఫ్రాన్స్, జూలై 4: ఫ్రాన్స్‌లోని రోకమడార్ పట్టణంలో 1300 సంవత్సరాల క్రితం నాటి మాయాఖడ్గం అదృశ్యమైంది. డురండల్ మాయాఖడ్గం ఫ్రెంచ్ ఎక్సాలిబర్ గానూ పిలుస్తారు. ఈ ఖడ్గం ప్రపంచంలోనే అతి పదునైనదిగా, పురాతమైనదిగా చరిత్రకెక్కింది. 100 అడుగుల ఎత్తులో ఉన్న రాయిలో సగం వరకు దిగిన ఖడ్గాన్ని దొంగిలించడం సంచలనం సృష్టిస్తోంది.

రాయిలోకి సగం దిగబడినా.. 

ఆ మాయాఖడ్గం 100 ఫీట్ల ఎత్తున్న రాయిలోకి సగం దిగబడిందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా అది చోరీకి గురయింది. ఆ కత్తిని ఒక దేవదూత కింగ్ చార్ల్ మెగ్నెకు ఇచ్చినట్లు చెబుతారు. 

అదెలా సాధ్యం

ఆ కత్తి ఎప్పుడో 100 అడుగుల ఎత్తున్న రాయిలోకి సగం దిగబడింది. కానీ ప్రస్తుతం అది చోరీకి గురికావడంతో పోలీసులు తల లు పట్టుకుంటున్నారు. 100 అడుగుల ఎత్తు లో ఉన్న రాయి నుంచి అది ఎవరు చోరీ చేసి ఉంటారు? అనే కోణంలో ఎంక్వైరీ ప్రా రంభించారు. ఈ పట్టణం చూసేందుకు వ చ్చిన ప్రతి పర్యాటకుడికి అక్కడి టూరిస్ట్ గైడ్లు కత్తిని గురించి వివరించేవారని పట్టణ మేయర్ డొమినిక్ తెలిపారు. ప్రాచీన చరిత్ర గల కత్తి అదృశ్యం కావడంతో స్థానికులు కలవరపడుతున్నారు. తమకు ఏదైనా అపా యం వస్తుందాఅని దిగులుచెందుతున్నారు. 

ఆ మాయాఖడ్గం చరిత్ర ఇదే.. 

డురండల్ అని పిలిచే ఈ ఖడ్గానికి అనేక అతీంద్రయ శక్తులు ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తారు. రాళ్లను చీల్చే శక్తి ఆ ఖడ్గానికి ఉందని నమ్ముతారు. అటువంటి ఆ కత్తిని ఒక దేవదూత 8వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి చార్ల్ మెగ్నెకి అందించిందట. ఖడ్గానికి శత్రువులను మట్టికరిపించే మాయా శక్తులున్నాయి. 11వ శతా బ్దంలో ఓ పద్యంలో ఈ మాయాఖడ్గం శక్తు ల గురించి వివరించారు. “ద సాంగ్ ఆఫ్ రొ నాల్డ్‌” పేరిట ఈ పాటకు సంబంధించిన కాపీ ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లోని బోడ్‌లియన్ లైబ్రరీలో ఉంది. తనకు దేవదూత బహుమతిగా ఇచ్చిన ఖడ్గాన్ని చక్రవర్తి తన వద్ద ఉత్తమ సైనికుడైన రోనాల్డ్ అనే వ్యక్తికి బహూకరించాడు. 

శత్రువులకు దొరకొద్దని 

ఎన్నో శక్తులున్న ఆ ఖడ్గం శత్రువులకు దొరకకూడదనే ఉద్దేశంతో రొనాల్డ్ ఆ కత్తిని నాశనం (విరగొట్టేందుకు) చేసేందుకు ప్ర యత్నించాట. కానీ అది సాధ్యం కాకపోవడంతో నైరాశ్యంలో ఆ కత్తిని గాల్లోకి విసిరగా.. అది వందల కిలోమీటర్లు గాలిలో ప్ర యాణించి రోకమడోర్ అనే పట్టణంలో రా యిలో చిక్కుకుంది. ఇప్పుడు అదే కత్తి చోరీకి గురి కావడం హాట్ టాపిగ్గా మారింది.