calender_icon.png 21 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబు సింగిల్‌గా నిలబడ్డారు..

15-11-2024 02:28:17 AM

నా తల్లిని అవమానించింది గుర్తు లేదా?

జగన్ కుటుంబాన్ని ఏనాడూ విమర్శించలేదు

మండలిలో ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఫైర్

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చి.. సింహంలా సింగిల్‌గా నిలబడ్డారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని వైఎస్సార్‌సీపీ సభ్యులు అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల మూడో రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. టీడీపీ నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఏనాడూ జగన్ కుటుంబం గురించి మేము ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు. నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు” అని ఫైర్ అయ్యారు.