28 June, 2026 | 12:15 PM

Breaking News

సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •  

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

28-06-2026 11:41 AM

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 0-5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వద్ద పోలియో కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. భారత్ 2014లోనే పోలియోరహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొన్ని దేశాల్లో ఇంకా ప్రభావం ఉండటంతో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హెల్త్ కమిషనర్ సంగీత, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్‌వోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.