28 June, 2026 | 11:12 AM

కారు, లారీ ఢీకొని యువకుడు మృతి

28-06-2026 10:32 AM

మధు మృతితో కొమ్మాలలో విషాద ఛాయలు

తుంగతుర్తి (విజయ క్రాంతి): కారు లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో ఆదివారం ఉదయం సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మల గ్రామానికి చెందిన బయ్య మధు (23), సూర్యాపేట నుండి బొల్లంపల్లి బంధువుల ఇంటికి వచ్చుచుండగా, జనగాం నుండి వస్తున్న ఐరన్ లోడు గల లారీ, గోపాలపురం మూల మడత వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో, కారులో ఉన్న మధు అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఏరియా దవాఖానకు తరలించి, విచారణ చేపట్టి, కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.