ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి
ఎల్లారెడ్డి చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన బీఎల్ఓ పోలింగ్ స్టేషన్ నెంబర్ 257 చెందిన ఓటర్ ఏఎంసీ రజిత వెంకటరామిరెడ్డి పూరించిన గణన పత్రంను ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను ఆర్డీవో రోడ్డ ప్రభాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకటరామి రెడ్డి అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేయాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లకు చరవాణి (ఫోన్) ద్వారా సమాచారం అందించి తిరిగి సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా స్థానిక బీఎల్ ఓ ల సహకారం తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన పత్రాలతో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో అర్ డి ఓ ప్రభాకర్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.






