25 May, 2026 | 12:28 AM

దేవర సీక్వెల్‌లో మార్పులు

31-01-2025 12:01 AM

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ‘దేవర’ విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా ఎలాంటి అప్‌డేట్ లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు.

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ క్రమంలోనే మరికొన్ని వారాల్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2025 మొత్తం ఈ ప్రాజెక్ట్‌కే ఎన్టీఆర్ కేటాయించబోతున్నాడని సమాచారం. 2026లో ‘దేవర’ సీక్వెల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఇప్పటి నుంచే కొరటాల శివ ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారట. సీక్వెల్‌లో దాదాపు నాలుగు భారీ ఎపిసోడ్స్ ఉంటాయట. తొలుత అనుకున్న కథలో మార్పులు చేర్పులు చేసి ‘దేవర’ మరణానికి సంబంధించిన ట్విస్ట్‌తో పాటు భైర పాత్రను హైలైట్ చేసే ఘట్టాలున్నాయని తెలుస్తోంది. సీక్వెల్‌లో జాన్వీ కపూర్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం లభించనుందని సమాచారం.