ఘనంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం జన్మదిన వేడుకలు
మోతె, ఆగస్టు 14 (విజయ క్రాంతి): కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం
నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి బొల్లం మల్లయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన నాయకుడని కొనియాడారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సహకారం, నాయకులు–కార్యకర్తలకు అందిస్తున్న మార్గదర్శకత్వం అభినందనీయమని అన్నారు.
మల్లన్నకు భవిష్యత్తులో మరింత ఉన్నతమైన రాజకీయ అవకాశాలు లభించాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆరె లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, నూకల శ్రీనివాస్ రెడ్డి,యూత్ అధ్యక్షులు జానీ పాషా, యుగంధర్ రెడ్డి, గంగులు, కాంపాటి వెంకన్న, రావిపహాడ్ సర్పంచ్ కోడి లింగయ్య, బానోత్ దేవ్లా, ఇండ్ల వెంకటేశ్వర్లు, కాకి సురేందర్ రెడ్డి, నాగయ్య, వేణు, దిలీప్, రవీంద్రచారి, చింతలపాటి రవి, రాముడు, కమలాకర్, నవీన్, నరేష్, దుర్గయ్య,తరుణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






